top of page

“ధ్యానం శరణం గచ్చామి"

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

బ్రహ్మర్షి
పిరమిడ్

బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆధ్యాత్మిక పాఠాలను కుల, మత, వర్ణ, వర్గ, జాతి భేదాలకు అతీతంగా అందరికీ తెలియజేయాలనే సదుద్దేశంతో అప్పాజీ గారు విశాఖపట్నంలో, సుమారు 100 మంది కూర్చుని ధ్యానం చేసేలా 32x32 పిరమిడ్ నిర్మించడం జరిగింది. అదే బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రంగా ఎదిగింది. వారి ఆశయాన్ని ముందుకి తీసుకువెళ్ళేలా క్షేత్రాన్ని సందర్శించే వారందరికీ ధ్యానం, ఆధ్యాత్మికత మరియు ధ్యానం యొక్క అనంతమైన ప్రయోజనాలను తెలియజేయడం; అహింస మరియు శాకాహారం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ నిత్య అన్నదానం ద్వారా శుద్ధ సాత్వికాహారం అందించడం మా ధ్యేయాలు.

విజన్

భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ శాంతియుతమైన మరియు సంతృప్తికరమైన జీవితం గడిపేందుకు ధ్యానం,

శాకాహారం మరియు శక్తికి మారుపేరు గా నిలిచే పిరమిడ్లతో నిండిన ప్రపంచాన్ని నిర్మించడం

మిషన్

ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యాన పద్ధతులతో ప్రతి వ్యక్తినీ శక్తివంతం చేయడం ఇంకా శక్తికేంద్రకాలైన 

పిరమిడ్లను నిర్మించేలా ప్రోత్సహించడం మరియు ఆ క్రమంలో అవసరమగు సహాయం చేయడం

లక్ష్యాలు

ప్రజలందరికీ ఆధ్యాత్మిక అవగాహన పెంచడం లో భాగంగా ధ్యాన బోధన, అహింసా యుతమైన శాకాహారం భుజించేట్టుగా ప్రోత్సహించడమే ధ్యేయంగా బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఈ క్రింది 7 ప్రధాన లక్ష్యాల ద్వారా తన ప్రణాళికను నిర్వహించాలని భావిస్తోంది:

  1. ధ్యానం నేర్పడానికి, బ్రహ్మర్షి పిరమిడ్ క్షేత్రం లో ధ్యానశిక్షణా తరగతులను నిర్వహించడం...

  2. చుట్టుపక్కల గ్రామాలు, పాఠశాలలు మరియు కళాశాలల్లో అవిరామంగా ధ్యానం నేర్పడం

  3. బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తిక్షేత్రాన్ని నివాస, భోజన వసతులతో సక్రమంగా నిర్వహించడం.

  4. విశాఖపట్నంలోని అన్ని వార్డులు మరియు మండల కేంద్రాలలో ఇంకా ముఖ్యమైన అనేక ప్రాంతాలలో పిరమిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం

  5. ధ్యానం మరియు శాకాహార  ప్రచార కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించడం

  6. PSSM కార్యకలాపాల కోసం స్వచ్ఛంద దళాన్ని (పిరమిడ్ సేవాదళ్) అభివృద్ధి చేయడం

Patriji best.JPG

ప్రతి మనిషికీ ఆనాపానసతి ధ్యానం తెలియాలన్న మీ ఆశయ సాగరంలో ఒక నీటి బిందువు ఈ బ్రహ్మర్షి క్షేత్రం.
ధ్యానానికి, ఆ ధ్యానం మాకు నేర్పిన మీకు ఇవే మా కృతజ్ఞతలు!   

- బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రం

నిర్వాహక
సభ్యులు

WhatsApp Image 2023-06-06 at 4.19.20 PM.jpeg

చిరునామా

మరిన్ని వివరాలకు

అప్పాజీ ఎస్టేట్, సుజాత నగర్, పాపయ్యరాజుపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 530051

email_edited.png
phone.png
  • Facebook
  • Twitter
  • LinkedIn
  • Instagram

కార్యక్రమ వివరాల కొరకు

Thanks for submitting!

© 2023 Brahmarshi

bottom of page